Oct 21,2023 15:23

ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్చుతాపురం మండలం సిపిఎం పార్టీ సభ్యుల జనరల్ బాడీ సమావేశం అచ్చుతాపురంలో జరిగింది. ఈ సమావేశం కు ముఖ్యఅతిథిగా సిపిఎం అనకాపల్లి  జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.కోటేశ్వరావు హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అచ్చుతాపురం ప్రాంతానికి గాల్లో వచ్చి వెళ్లారు తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు ఏవి పరిష్కరించలేదు అచ్చుతాపురం ఎస్ ఈ జెడ్ నిర్వాసితులకు ,స్థానికులకు 75% ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన హామీ అమలు చేయలేదు ఎస్ ఈ జెడ్, ఫార్మ పరిశ్రమలలో పనిచేస్తున్న కార్మికులకు 15 సంవత్సరాల క్రితం ఉన్న వేతనాలు నేటికీ అమలు చేస్తున్నారు. కనీస వేతనాలు పెంచాలని అడుగుతున్న పట్టించుకున్న పాపాన పోలేదు అచ్చుతాపురం నుండి అనకాపల్లి రోడ్డు శిధిలావస్థలో ఉన్నా  రోడ్డు విస్తరణ పనులు చేపట్టకపోవడం వలన నిత్యం ప్రజలు ప్రమాదాలు బారిన పడుతున్నారు పూడిమడకలో జెట్టి నిర్మిస్తామని చెప్పి సంవత్సరాలు గడుస్తున్న నేటికీ పనులు మొదలు పెట్టలేదు  పరిశ్రమల మధ్యలో ఉన్న చిన్నపూడి, దుప్పుతూరు, చిన తాలదిబ్బ గ్రామాల ప్రజలు తీవ్ర కాలుష్యంతో అనారోగ్యలకు గురైవుతున్నారు  వీరిని సురక్షిత ప్రాంతాల కు తరలించి పునరావాసం కల్పించాలని, జగనన్న ఇల్లు నిర్మాణం కోసం ఎదురువాడ ,గొర్లిధర్మవరం  గ్రామంలో పేదల నుండి తీసుకున్న భూములకు నేటికీ పరిహారం లేదు వీటి వెంటనే పరిహారం ఇవ్వాలని, కొండకర్ల ఆవలో పూడిక తీయించి అవపై ఆధారపడిన మత్స్యకారులకు ఉపాధి కల్పించాలని ఆవనీరు రైతులకు అందేలా అభివృద్ధి చేయాలని, అచ్చుతాపురం కేంద్రంగా ఈఎస్ఐ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం వెంటనే చేపట్టాలని తదితర సమస్యలపై రాబోయే కాలంలో సిపిఎం ప్రజా సమస్యల పరిష్కారానికి జరిగే బస్సు యాత్రను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అచ్యుతాపురం కన్వీనర్ ఆర్ .రాము సిపిఎం సీనియర్ నాయకులు కర్రీ. అప్పారావు, బుద్ధ. రంగారావు, తిమ్మరాజుపేట కార్యదర్శి ఎస్. రామ్ నాయుడు, హరిపాలెం కార్యదర్శి బి. రామ్ కుమార్, అచ్యుతాపురం కార్యదర్శి కె సోమనాయుడు, పూడిమడక నాయకులు చాపల తాతయ్య, కృష్ణ ,లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.