ప్రజాశక్తి-రాంబిల్లి : రాంబిల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అనకాపల్లి జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈరోజు రాంబిల్లి మండలంలో వెలుచూరి, పెద్ద కలువులాపల్లి గ్రామాలలో రైతులు వేసి ఎండిపోయిన వరి పొలాలను పరిశీలించారు*రైతులు వరి పంట వేయడానికి ఎకరానికి ముఫై నుండి ముప్పై ఐదు వేల వరకు ఖర్చు చేశారని అయినా వర్షాలు లేక పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. రాంబిల్లి మండలం లో ఖరీఫ్ సీజన్లో 6,815 ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా కేవలం 3,130 ఎకరాల్లో మాత్రమే వరి సాగు చేశారని, అంతేకాకుండా 49 శాతం మాత్రమే వర్షపాతం నమోదైందన్నారు, అయినా ప్రభుత్వం కరువు మండలంగా ప్రకటించకుండా నిర్లక్ష్యం చేస్తూ రైతులకు అన్యాయం చేస్తుందని తెలిపారు. అనకాపల్లి జిల్లాలో ఉన్న ఏడు అసెంబ్లీ నియోజకవర్గంలో అదికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందులో ఇద్దరు మంత్రులు ఉన్నారు ఇందులో వక్కరు కూడా జిల్లా లో కరువు గురించి, రైతుల కష్టాలు గురించి మాట్లాడకపోవడం అన్యాయం అన్నారు. నిన్న జిల్లా కలెక్టర్ కరువు, వ్యవసాయ పరిస్థితులపై సమావేశం నిర్వహించారు రైతులకు సలహాలు ఇస్తున్నారు తప్ప రైతులను ఆదుకోవడానికి ఏవిధమైన చర్యలు తీసుకోలేదని తెలిపారు. ఈ కష్టకాలంలో రైతులకు కావాల్సింది సలహాలు కాదు సహాకారం కావాలని ఇప్పుడు రైతు లను ఆదుకోవడానికి వెంటనే అనకాపల్లి జిల్లాను, రాంబిల్లి మండలాన్ని కరువు మండలాలుగా ప్రకటించి రైతులను ఆదుకోవాలని కోరారు.కూలీలు చేయడానికి పనులు లేక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు వెంటనే 200 రోజులు ఉపాధి పనులు కల్పించి కూలీలను ఆదుకోవాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం రైతులను ఆదుకోవాలని చిత్తశుద్ధి ఉన్నా వెంటనే రాంబిల్లి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించి రైతులను, కూలీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్ష, కార్యదర్శిలు కె.అప్పారావు, ఎం.అప్పలరాజు, సిపిఎం మండల కన్వీనర్ జి.దేముడునాయుడు, చిన్న కాలువలా పల్లి సర్పంచ్ వై.శ్రీనువాసరావు, నాయకులు సిహెచ్శివాజీ, సిహెచ్రా.మకృష్ణ, ఎన్.నారాయణరావు, వై.రాము, ఎం.శ్రీనివాస్, ఎస్.రాంబాబు, టి.నూకరాజు తదితరులు పాల్గొన్నారు