ప్రజాశక్తి-అనకాపల్లి : చోడవరం నుండి నర్సీపట్నం వెళ్ళు ఆర్ అండ్ బి రోడ్ లో పూర్తిగా గోతులు పడిపోయి రోజు ప్రయాణికులు ప్రమాదాలు గురవుతున్న ఆర్ అండ్ బి అధికారులు ఇంటికి పరిమితం అయిపోయి నెలకు లక్షల్లో జీతాలు తీసుకుని రోడ్డు యొక్క పరిస్థితి పట్టించుకునే పరిస్థితి లేదు. స్థానిక శాసనసభ్యుడు ప్రచారాలకు పండగలకు, ఆర్భాటాలకు, పరిమితం అవుతున్నారు. తప్పితే రోడ్లు గూర్చి పట్టించుకునే పరిస్థితి లేదని కూలిపోయిన కలవరట్దులకు రక్షణ గోడల్లు నిర్మించాలని, ఎన్నో సందర్భాల్లో సిపిఐ ఆధ్వర్యంలో ధర్నాలో నిరసనలు చేసిన అధికారులు గానీ స్థానిక శాసనసభ్యులలో చలనం లేకపోవడం చాలా దుర్మార్గమన్నారు. ప్రజల యొక్క ప్రాణాలు గాలి లోకలిసిపోతున్న పట్టించుకునే పరిస్థితి లేదని ఆర్ అండ్ బి కార్యాలయం ఖాళీ కుర్చీలకే పరిమితం అవుతూ సంవత్సరానికి ఒకసారి ఆర్ అండ్ బి కార్యాలయం దుమ్ము ధూళి తుడుచుకోవడానికి తెరవడం జరుగుతోంది. కనీసం గోతులు పడిన దగ్గర కానీ కలవరట్ల దగ్గర హెచ్చరిక బోర్డులు కానీ పెట్టకపోవడం వల్ల నిరంతరం ప్రయాణికులు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా స్థానిక శాసనసభ్యుడు మరియు అధికారులు వెంటనే చర్యలు చేపట్టకపోతే కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన అవసరం ఏర్పడుతుందని, అదే సందర్భంలో ఏదైతే ప్రమాదాల గురవుతున్న ప్రయాణికులకు నష్ట పరిహారం చెల్లించవలసిన అవసరం ఉందని, లేకపోతే రానున్న కాలంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం ఏర్పడుతుందని కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఆర్ అండ్ బి కార్యాలయాన్ని ముట్టడి చేస్తామని, ఈ సందర్భంగా అనకాపల్లి జిల్లా కమ్యూనిస్టు పార్టీ కార్యవర్గ సభ్యుడు అప్పలరాజు హెచ్చరించారు.