Nov 05,2022 11:25

ప్రజాశక్తి - కశింకోట : ప్రజా సంక్షేమం, అభివృద్ధి వైసిపి లక్ష్యం అని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ అన్నారు. కశింకోటలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు ముందు గా కళ్యాణమండపం నిర్మాణం, పొలీస్ స్టేషన్ వద్ద సిసి కెమెరాలు, సచివాలయం భవనాలు ప్రారంభం, నాడు నేడు పనులు హైస్కూల్ శంఖుస్థాపన, నిర్మాణాలు ప్రారంభం చేశారు. ఈకార్యక్రమంలో అనకాపల్లి  పార్లమెంట్ సభ్యులు డాక్టర్ భీశెట్టి సత్యవతి, జిల్లా వైఎస్సార్ పార్టీ అధికార ప్రతినిధి మళ్ళ బుల్లి బాబు మండల పరిషత్ అధ్యక్షురాలు కలగా లక్ష్మి, జెడ్ పి టి సి దంతులూరి శ్రీధర్ రాజు, సర్పంచ్ లు కలగా గున్నయ నాయుడు, మంత్రి జయరజనీ, వైస్ ఎమ్ పి పి పెంటకోట జ్యోతి, మండల పార్టీ అధ్యక్షుడు గొల్లి విల్లి శ్రీనివాసరావు, ఎమ్ పి డి ఓ కొంకి అప్పారావు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు