Dec 12,2022 08:18

ఆశా వర్కర్ల రాష్ట్ర మహాసభలకు
స్వాగతం.... సుస్వాగతం ..2

చరణం1 : ఎఱ్ఱ జెండ చేత పట్టి పోరాట బాట పట్టి
కనీస వేతనము కొరకు రోడ్డెక్కి కధం తొక్కి.. 2
పాలకులు నిర్బంధం ఎదిరించిన వనితలకు
స్వాగతం... సుస్వాగతం...2

చరణం 2 : వేకువ జామున లేచి తీతువు పిట్టై తిరిగి
గర్భిణీలకు సేవ చేసి పురుడు పోసీ.. మందులిస్తే
గౌరవం, గుర్తింపు లేకున్నా సేవచేసే ఆశా వర్కర్లకు
స్వాగతం... సుస్వాగతం ..2
చరణం3 : పనిభారం మోయలేక కనీస వేతనం లేక
అధికారులు వేధింపులు అనునిత్యం భరిస్తూ....2
సమాన పనికి సమాన వేతనంకై దీరుల్లా పోరాడిన అశాలకు
స్వాగతం... సుస్వాగతం...2

- రెడ్డి శంకరరావు
94943 33511