Nov 22,2023 07:55

ఓటంటే
నీ జేబులో నోటు కాదు
ప్రజాస్వామ్యాన్ని
పరిరక్షించే కోటు.
ఓటంటే
సారా చుక్క కాదు
రాజ్యాంగ విలువలను
కాపాడే సిరా చుక్క.
ఓటంటే
నీవు తిరిగే బెంజి కాదు
పేదోడికి దొరికే
మూడు పూట్ల గంజి.
ఓటంటే
నీవు కూర్చునే సీటు కాదు
గూడులేని వారికి
నీవిచ్చే ప్లాటు.
ఓటంటే
నీవు తాగే ఖరీదైన బీరు కాదు
సాగు భూమికి
నీవు ఇచ్చే నీరు.
ఓటంటే
నీవు పవళించే పరుపు కాదు
రహదారి భద్రతకు
నీవు వేసే రోడ్డు.
ఓటంటే
నీవు వృద్ధి కావడం కాదు
బడుగు జీవితాలను
నీవు చేసే అభివృద్ధి.
ఓటంటే
నీవు ఇచ్చే తాయిలాలు కాదు
కనీస అవసరాలకు
నీవు ఇచ్చే సౌకర్యాలు.


- కయ్యూరు బాలసుబ్రమణ్యం
సెల్‌ : 7780277240