Nov 20,2023 09:05

ఎవరు ఎవరికంటే
ఎక్కువ అమానవీయం?
ఎవరు ఎవరికంటే
ఎక్కువ క్రూరులు?
ఎవరు కొట్టబడ్డారు, రక్తసిక్తమయ్యారు,
విరిగిపోయారు?

ఎవరు ఎవరి కంటే
ఎక్కువ ఆయుధాలు కలిగి ఉన్నారు?
ఎవరు దాక్కున్నారు, చనిపోతున్నారు,
సంతాపాన్ని ప్రకటిస్తున్నారు?
ఎవరు నిర్జీవమయ్యారు,
బాధబడ్డారు, కిడ్నాప్‌ అవుతున్నారు,
ఆకలితో అలమటిస్తున్నారు? చిక్కుకుపోతున్నారు?
ఎవరు ఆసుపత్రిలో, ఎవరు పండుగలో,
ఎవరు నిద్ర లేస్తున్నారు?
ఎవరు నిద్రకు సిద్ధమౌతున్నారు?

ఎవరు గుక్కెడు నీరు లేకుండా!
ఎవరు ఇంటికి దూరమై,
సడలిన విశ్వాసంతో ఉన్నారు?
ఎవరి భూమి, ఎవరి చరిత్ర,
ఎవరి మసీదు, ఎవరి మందిరం
ఎవరి కోపం, ఎవరి భయం?

ఎవరు పసికందును
చంకలో పెట్టుకొని నడుస్తున్నది?

ఆంగ్లం : Susan Dambroff
స్వేచ్ఛానువాదం : జాని తక్కెడశిల