Mar 04,2023 16:02

ప్రజాశక్తి-చీరాల (బాపట్ల): ఎమ్మెల్సి ఎన్నికల వెబ్ కాస్టింగ్ శిక్షణా కార్యక్రమం శనివారం పురపాలక సంఘంలో జరిగింది. చీరాల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులు ఈశిక్షణ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీవో సరోజినీ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో ఎప్పటికప్పుడు అప్రమత్తతో వ్యవహరించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తాన్ని వెబ్ కాస్టింగ్ ద్వారా చిత్రీకరించడం జరుగుతుందన్నారు. ఈ వెబ్ కాస్టింగ్ ప్రక్రియకు చీరాల ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థులను ఎంపిక చేయటం జరిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సాంకేతిక నిపుణులు వెబ్ కాస్టింగ్ ఎలా మానిటరింగ్ చేయాలి, రికార్డింగ్ చేసే విధానం, స్టోర్ చేయటం తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో తాహసిల్దార్ ప్రభాకరరావు,హౌసింగ్ డి ఇ గోవిందరెడ్డి, తదితర అధికారులు పాల్గొన్నారు. జెసి డాక్టర్ కె శ్రీనివాసులు ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.