
అందమైన రంగుల ప్రపంచంలో
విహరింప చేస్తుంది
ఆనంద లోకంలో
ప్రయాణింపజేస్తుంది
ఆటపాటలతో
పాఠాలు నేర్పుతుంది
పసితనపు హృదయాలను
తాకే అనుభవాల
విజ్ఞానగని అవుతుంది
అమ్మఒడిని మైమరిపిస్తుంది
అనురాగ సన్నాయి మోగిస్తుంది
సీతాకోక చిలుకై
ఎగర మంటుంది
బడిగంట వినమంటుంది
సకాలంలో రమ్మటుంది
క్రమశిక్షణ అభివృద్ధికి సోపానమని
గుర్తుంచుకోమంటుంది
జీవన మార్గం చూపే
దివిటీ బడి అని తెలియ జేస్తుంది
- గాదిరాజు రంగరాజు,
87901 22275.