
తేనెల తొలకరి తెలుగు
వెన్నెల ఝరి తెలుగు
మల్లెల పరిమళం తెలుగు
అమ్మ ప్రేమామృతం తెలుగు
జాతీయాల సంపద తెలుగు
పొడుపు కథల విడుపు తెలుగు
సామెతల చమత్కారం తెలుగు
శతక పద్యాల వెలుగు తెలుగు
త్యాగయ్య కృతులలో తెలుగు
అన్నమయ్య కీర్తనలలో తెలుగు
అమ్మ గోరుముద్దలలో తెలుగు
ఆనందాల వెలుగు తెలుగు
అమృతం కురిపించిన తిలక్ కలం తెలుగు
చైతన్యం రగిలించే శ్రీ శ్రీ కవనం తెలుగు
జంధ్యాల నవ్వుల పువ్వులు తెలుగు
సినారె గజల్ మెరుపులు తెలుగు
నాగావళి వంశధార పరవళ్ళు తెలుగు
మొల్ల రామాయణమే తెలుగు
పోతన భాగవతమై తెలుగు
కాకతీయ రుద్రమ్మ పౌరుషం తెలుగు
అల్లూరి ధైర్య వచనాలు తెలుగు
తిమ్మరుసు ధీయుక్తి తెలుగు
ఎంకి నాయుడు పాటలు తెలుగు
నా తెలుగు... మన తెలుగు
అణువణువు అమృతాల మణుగు
- మొర్రి గోపి,
88978 82202