Nov 14,2023 09:41

చిన్నారి బాలలం
చిట్టిపొట్టి పిల్లలం..
చిరుకాంతుల దివ్వెలం..!
చదువు సంధ్యల్లో మేం
చాలా చక్కని మెరికలం!
చిన్ని చిన్ని అల్లర్లతో
అలరించే.. పలవరించే..
చిచ్చర పిడుగులం..!
అమ్మనాన్నలకు మేం
నవ్య కాంతులం
తొలకరి చినుకులం
లేలేత చిగురులం
పూబోణి మొగ్గలం
నిత్య సంతోషాన్నిచ్చే..
నింగిలోని చుక్కలం..
ఆటల్లో మేం.. ఆరితేరినాం..
అన్నిమరచి ఆనందంలో
మునిగి తేలుతాం..!
పాటల్లో మేం..
వీణా తంత్రులం..
గాన గంధర్వులం..
చేతల్లోనేమో..
చిచ్చర పిడుగులం..
చాచా నెహ్రూ
గుండెల్లో మేం..
పసిమిదేరిన పువ్వులం
పండు వెన్నెల నవ్వులం
హే.. మేమేలే రేపటి..
భావి భారత పౌరులం
భరతమాత బిడ్డలం..!
 

- ప్రజ్ఞ