
ప్రజాశక్తి-బుచ్చయ్యపేట : ఎర్రవాయిలో ప్రసిద్ధి చెందిన రాజాం మరిడిమాంబ గుడి వద్ద గ్రామానికి చెందిన పూర్వపు ఇంజనీరింగ్ విద్యార్థి గోగుల జనార్ధన్ భక్తులకు తన సొంత నిధులతో త్రాగునీటి సదుపాయం ఏర్పాటు చేశారు. రూ.1.5 లక్షలతో మినీ వాటర్ ట్యాంకు, బోరు, ట్యాపులు నిర్మించారు. దీనిని స్థానిక సర్పంచ్, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మరిసా నాని గురువారం గ్రామ పెద్దల సమక్షంలో ప్రారంభించారు.జనార్దన్ ఇప్పటికే గ్రామానికి చెందిన 50 మంది యువకులకు ప్రవేటుగా ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించారు. ఈ సందర్భంగా పలువురు జనార్ధనను ప్రత్యేకంగా అభినందించారు. సర్పంచులు మరిసా అప్పలనాయుడు, పెదరమణ, మాజీ ఎంపీటీసీ సతీష్, నరేష్, షేక్ సత్తార్, ఆకుల నాగేశ్వరరావు, సుంకర ప్రసాదు, భాస్కర్ రావు, కర్రి నాయుడు బాబు, కన్నారావు, స్వామినాయుడు ఇందల శ్రీను, తదితరులు పాల్గొన్నారు.