Jul 21,2023 08:33

ఆటల పాటల పిల్లల్లారా
భావి భారత పౌరుల్లారా
నీటి విలువ తెలుసుకోండి
జగతికి మూలం నీరేనండి

జీవరాశులు బతకాలన్నా
మనం బాగుండాలన్నా
నీటి వృథానాపండి
నీటిని పొదుపు చేయండి

అధిక శాతం సముద్రాలున్నా
వాగులు వంకలు నదులున్నా
తాగు నీరు దొరకడం లేదండి
ఉన్న నీటిని చూసుకు వాడండి

బావులు బోర్లు ఎన్నున్నా
వేసవిలో నీరు సున్నా సున్నా
ఇంకుడు గుంతలు తవ్వండి
వర్షపు నీరు భూమిన నింపండి

చెరువులు కాలువలెన్నున్నా
ఎండాకాలం ఎండునన్నా
నీటి తొట్టెలు పెట్టండి
పక్షుల, జంతువుల కాపాడండి

సమృద్ధి నీరు ఉన్నప్పటికీ
నీటి కొరతా లేనప్పటికీ
నీటిని కలుషితం చేయకండి
జీవుల ప్రాణం రక్షించండి

నీరు లేని జీవితమండీ
ఊహించడం కష్టమండీ
భూమిపై నీరు లేక పోతే
జంతుజాలమే ఉండదండీ !

- ఆవుల చక్రపాణి యాదవ్‌
99633 50973