ప్రజాశక్తి-గణపవరం : జంగారెడ్డిగూడెంలో జరిగే వ్యవసాయ కార్మిక సంఘం 29వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని సంఘ గణపవరం మండల కార్యదర్శి నరాలశెట్టి రామకృష్ణ అన్నారు రాష్ట్ర మహాసభ విజయవంతం కావాలని కోరుతూ సోమవారం మండల కమిటీ ఆధ్వర్యంలో జల్లి కాకినాడలో గోడ పోస్టర్ విడుదల చేశారు. వ్యవసాయ కార్మిక సమస్యలపై నిరంతరం పనిచేస్తున్న సంఘ రాష్ట్ర మహాసభలు విజయవంతం చేయడానికి వ్యవసాయ కార్మికులు తమ వంతు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల అధ్యక్షులు ఎం పెంటారావు, నాయకులు సుబ్రహ్మణ్యం, ఎన్ హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.










