ప్రజాశక్తి-బుట్టాయిగూడెం : తాసిల్దార్ కార్యాలయం వద్ద బుట్టాయిగూడెం మండలంలోని విఆర్వోలు ధర్నా చేసి తాసిల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వీఆర్వోలు మాట్లాడుతూ పని ఒత్తిడి కారణంగా చనిపోయిన గ్రామ రెవెన్యూ అధికారుల కుటుంబాలకు న్యాయం చేయాలని వారి కుటుంబ సభ్యులకు వెంటనే 25 లక్షల ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాలు 658 జీవో ప్రకారం వెంటనే ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలామంది విఆర్వోలు చనిపోతే వారి కుటుంబానికి ఇప్పటివరకు కనీసం మట్టి ఖర్చులు కూడా ఇవ్వడం లేదని వెంటనే చనిపోయిన వారి కుటుంబాలకు రావలసిన ఆర్థిక ప్రయోజనాలు కల్పించాలని, గ్రామ రెవెన్యూ అధికారులకు పని ఒత్తిడి తగ్గించాలని డిమాండ్ చేశారు. పిఓఎల్ఆర్ ప్రింట్ కొరకు ఇప్పటివరకు వీఆర్వోలు చాలా ఖర్చు చేశారని మరల ఇప్పుడు రీసర్వేకు కూడా వీఆర్వోలు డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుందని ఈ విషయంలో అందరూ ఆందోళన చెందుతున్నారని రీ సర్వే మరియు polr పేరుతో విఆర్వోలతో పెట్టించిన ఖర్చులు వెంటనే చెల్లించాలని డిమాండ్స చేశారు. సర్వేకు సంబంధించి దీర్ఘకాలిక ప్రణాళిక ఉండాలి కానీ సర్వేకు సంబంధించి వంద రోజులలోనే రీ సర్వే కంప్లీట్ చేయాలని నిబంధన సడలించాలని, వీఆర్వోలు పై ఒత్తిడి లేకుండా చేయాలని ముఖ్యంగా ప్రస్తుతం వీఆర్ఏ నుండి గ్రేడు 2 విఆర్వోలుగా పని చేస్తున్న 3795 మంది గ్రామ రెవెన్యూ అధికారులకు వెంటనే ప్రొఫెషన్ డిక్లేర్ చేసి పేస్కేల్ అమలు చేయాలని కోరారు. గ్రామ వార్డు సచివాలయంలో నూటికి 90% రెవెన్యూ కు సంబంధించి సర్వీసులు చేస్తున్నారని కావున వీఆర్వోలకు కావలసిన కంప్యూటర్ సిస్టమ్స్ స్టేషనరీ ఇవ్వాలని, విఆర్వోలకు రిసర్వే తో పాటు రెగ్యులర్ రెవెన్యూ సర్వీసులు ఉన్నందున పని ఒత్తిడి తగ్గించాలని కోరారు. ప్రభుత్వం నిర్దేశించిన సమయం ఉదయం 10 నుండి సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే విఆర్వోలు విధులు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని సెలవు రోజులలో పండుగ రోజులలో వీఆర్వోలకు విధులు అప్పగించకుండా అధికారులకు తమ ఆదేశాలు వెంటనే జారీ చేయాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలకు జిల్లా కేంద్రాల్లో జరిగే ఫిజికల్ మీటింగ్లకు గెలవడం వల్ల వాళ్ళు తిరిగి మారుమూల గ్రామాలకు వెళ్లడం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని తిరుగు ప్రయాణంలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల యాక్సిడెంట్లు జరుగు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని జిల్లా కేంద్రాల్లో మరియు డివిజన్ కేంద్రాల్లో జరిగే మీటింగ్లకు వీఆర్వోలను పిలవకుండా ఇచ్చి తగు సమాచార ఎమ్మార్వోలకు ద్వారా మండల కేంద్రాల్లో మీటింగ్లు ఏర్పాటు చేయాలని, రైస్ మిల్లుల దగ్గర టైం తో సంబంధం లేకుండా పనిచేస్తున్న వీఆర్వోలకు కస్టోడియం ఆఫీసర్ విధుల నుండి తప్పించాలని, ఇతర శాఖల పనులు చెప్పరాదని గౌరవ సిసిఎల్ వారు చెప్పినను ఇతర శాఖల పనులు అధికారులు చెబుతున్నారు దీనివల్ల ఏ పని ముందు చేయాలో తెలియక మానసికంగా కృంగిపోతున్నామని అధికారులు ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:30 నిమిషాల లోపే ఏమైనా మీటింగులు పెట్టుకోవాలని టైం దాటి పెట్టడం వల్ల తిరిగి ఇంటికి వెళ్లే సమయంలో ప్రమాదాలకు గురవుతున్నామని అత్యవసర సమయంలో మాత్రం మేము 24/7 విధులు నిర్వహిస్తున్నామని అలాకాకుండా కొందరు అధికారులు సమయపాలన లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మీరు కార్యానికి రండి అని చెప్పడం వల్ల దైవరా ఇబ్బందులు పడుతున్నామన్నారు. అలాగే కొంతమంది అధికారులు మా గ్రామ రెవెన్యూ అధికారులను నోటికి వచ్చినటి ఇష్టం వచ్చినట్లు కావాలని తిడుతూ ఏ టైం లో పడితే ఆ టైంలో కార్యాలయానికి హాజరుకావాలని చెప్పడం వలన మేము మానసికంగా శారీరకంగా బాధపడుతున్నామని అలా చేసే అధికారులపై సంఘం తరఫున ఉన్నతాధికారులకు తెలియజేసి వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకోమని పోరాడుతామన్నమన్నారు. రాష్ట్రంలో ఉన్న సగం సీనియర్ అసిస్టెంట్ పోస్టులు అప్గ్రేడ్ చేసి ఆర్ ఐ పోస్టులు తగ్గించారు. దాని వలన అన్ని రకాల ఎంక్వయిరీ పనులు పై పడింది అప్గ్రేడ్ చేసిన పోస్టుల స్థానంలో అర్హులైన విఆర్వోలతో ఎమ్మారై లుగా నియమించాలని, రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను అర్హులైన వీఆర్ఏలతో వెంటనే భర్తీ చేయాలని వెంటనే ప్రభుత్వం మా సమస్యలు పరిష్కారానికి మా రాష్ట్ర సంఘాన్ని చర్చలకు ఆహ్వానించి మా సమస్యల పరిష్కారం కోరారు ఈ కార్యక్రమంలో బుట్టాయగూడెం మండలం లోని వి ర్ ఓ లు పాల్గొన్నారు.










