Dec 12,2022 16:52
  •  పోస్టర్ ఆవిష్కరణలో వక్తలు పిలుపు

ప్రజాశక్తి-విశాఖ: సిఐటియు విశాఖ జిల్లా 12వ మహాసభలను ఈనెల 22, 23 తేదీల్లో డాబా గార్డెన్స్ అల్లూరి సీతారామరాజు విజ్ఞాన్ కేంద్రంలో జరుగుతుందని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కే ఎస్ వి కుమార్ తెలిపారు. ఈ మహాసభలను విశాఖ కార్మిక వర్గం జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం మద్దిలపాలెం సిఐటియు కార్యాలయంలో మహాసభల పాస్టర్ ఆవిష్కరణ జరిగింది. ఈ పోస్టర్ ఆవిష్కరణలో సిఐటియు జిల్లా అధ్యక్షులు కెయం శ్రీనివాస్, జిల్లా కార్యదర్శి బి జగన్, పబ్లిక్ సెక్టర్ కోఆర్డినేషన్ కో కన్వీనర్ కే యం కుమార్ మంగళం ఉన్నారు. కుమార్ మాట్లాడుతూ విశాఖపట్నంలో గత మూడేళ్లలో సిఐటియు స్వతంత్రంగా నిర్వహించిన కార్యక్రమాలతో పాటు, ఐక్య కార్యాచరణ పోరాటాలు, ప్రభుత్వ సంస్థల పరిరక్షణ, కార్మికుల సమస్యలు పై  ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ మహాసభలకు విశాఖ జిల్లాలో ఉండే వివిధ యూనియన్లు రంగాల నుండి ప్రతినిధులు 360 మంది పాల్గొంటున్నారని తెలిపారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ సంస్థలు పరిరక్షణ కోసం గత రెండేళ్ల నుండి నిర్వహిస్తున్న పోరాటాలను సమీక్ష చేసుకొని ప్రభుత్వ తీరుపై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. జిల్లాల ఉండే కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికుల ను రెగ్యులర్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, తప్పుడు బళ్ళు ముఠా ఆటో బిల్డింగు తదితర అసంఘటనగా కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, ఉపాధి రక్షణ కల్పించాలని, ప్రభుత్వ నిర్బంధం ఆపాలని, ఆశ అంగనవాడి మిడ్ డే మీ ఇల్లు అంటే స్కీం వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, రైతాంగం చేసిన పోరాటానికి సంఘీభావంగా నిర్వహించిన కార్యక్రమాలను, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలపై ఈ మహాసభలో ప్రధాన చర్చ ఉంటుందన్నారు. రాబోయే మూడేళ్ల కాలానికి కార్యాచరణను రూపొందించుకొని నూతన నాయకత్వాన్ని ఎన్నుకోవడం జరుగుతుంది అన్నారు. ఈ మహాసభల పర్యవేక్షణకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ నర్సింగరావు, రాష్ట్ర కార్యదర్శి ఎం జగ్గినాయుడు, కే ఉమామహేశ్వరరావు హాజరవుతారని తెలిపారు.