* చితకబాదిన భార్య, అత్త
లక్నో : రాజకీయం అండగా ఉంటే ఎలాంటి వెధవ వేషాలు వేసినా అడిగేవాడే ఉండరనుకుంటున్నారేమో..బిజెపి నేతల బరితెగింపునకు హద్దే లేకుండా పోతోంది. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో బుందేల్‌ఖండ్ ప్రాంతీయ బిజెపి నాయకుడు మోహిత్ సోంకర్ ఓ మహిళతో కారులో రాసలీలల్లో మునిగితేలాడు. అంతలో అతని భార్య, అత్త వచ్చి అతడ్ని పట్టుకుని చితకబాదారు. ఇద్దరిని తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో కూడా వైరల్ అవుతోంది. మోహిత్ సోంకర్ ఆరేళ్ల కిందట మోని సోంకర్ ను వివాహం చేసుకున్నాడు. చాలా కాలంగా తనను వేధిస్తున్నాడని కూడా భార్య ఆరోపించారు. మోహిత్‌కు ఒక కుమారుడు, కుమార్తె కూడా ఉన్నారు. బిజెపి నాయకుడిపై అతని భార్య, మహిళ భర్త జూహీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుడు మోహిత్ సహా నలుగురిపై కేసు నమోదు చేశారు.










