Feb 10,2021 14:49

తిరుపతి : కరోనా వ్యాక్సిన్‌ వికటించడంతో మరో వ్యక్తి మృతిచెందారు. ఈ ఘటన తిరుపతిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. తిరుపతి మల్లంగుంట పంచాయతీ, రామానుజపల్లి అంబేద్కర్‌ కాలనీకి చెందిన కృష్ణయ్య నిన్న కరోనా వ్యాక్సిన్‌ తీసుకున్నాడు. అయితే, వ్యాక్సిన్‌ తీసుకున్న 24 గంటల్లోనే మృతి చెందినట్లు అతని కుటుంబసభ్యులు చెబుతున్నారు. కృష్ణయ్యకు ఎలాంటి ఆరోగ్య సమస్యలూ లేవని, వాక్సిన్‌ వికటించడంతోనే మృతిచెందాడని బంధువులు ఆరోపిస్తున్నారు.