ప్రజాశక్తి - ఏలేశ్వరం(కాకినాడ) : మండలంలోని 18 నుండి 59 సంవత్సరాల మధ్య వయసు కలిగిన ప్రతి ఒక్కరు విధిగా మూడో విడత వ్యాక్సిన్ తీసుకోవాలని ఆరోగ్య విస్తరణ అధికారి కే భాస్కరరావు పిలుపునిచ్చారు. మండలంలోని అన్ని గ్రామ వార్డు సచివాలయాలలో వ్యాక్సినేషన్ క్యాంపులను కొనసాగిస్తామన్నారు. పట్టణ, మండల పరిధిలో 47980 మందికి ఉచిత ప్రికాషన్ డోసులను సిద్ధం చేశామన్నారు. ఎటువంటి అపోహలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ తీసుకునేలా చర్యలు తీసుకుంటామన్నారు.










