ప్రజాశక్తి - పెద్దాపురం(కాకినాడ జిల్లా) : కాకినాడ జిల్లా పెద్దాపురం పట్టణానికి చెందిన సూక్ష్మ కళాఖండాల శిల్పి, గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ గ్రహీత తాళాబత్తుల సాయి 2023 ప్రపంచ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో సూక్ష్మ బంగారు వరల్డ్ కప్‌ను రూపొందించారు. 0.5 మిల్లీగ్రాముల బంగారంతో దీనిని రూపొందించానని ఆయన సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీనిని తయారు చేసేందుకు రెండు గంటల సమయం పట్టిందని పేర్కొన్నారు. గతంలో పలు సూక్ష్మఖండాలను తయారు చేశానని, ఇందుకుగాను గతంలోనే గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ సాధించానని గుర్తు చేశారు.