ప్రజాశక్తి-గణపవరం : గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా జగన్ ప్రభుత్వం పని చేస్తుందని ఉంగుటూరు శాసనసభ్యులు పుప్పాల శ్రీనివాస రావు(వాసుబాబు) అన్నారు శుక్రవారం వల్లూరు వీరేశ్వరపురం గ్రామాల్లో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా నెల్లూరులో 40 లక్షలతో నిర్మించిన నూతన సచివాలయ భవనాన్ని ప్రారంభించారు 22 లక్షలతో నిర్మించిన రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభోత్సవం చేశారు వీరేశ్వరపురంలో నాడు నేడు పేజ్ టూ లో 29 లక్షల రూపాయలతో పాఠశాలకు అదనపు గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు ఎస్సీ పేటలో 24 లక్షలతో నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు అనంతరం వాసు బాబు మాట్లాడుతూ గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కలగ చేయడానికి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని అన్నారు ఉంగుటూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో నడపటానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వల్లూరు గ్రామ సర్పంచ్ ముచ్చర్ల వేణుగోపాలకృష్ణ వీరేశ్వరపురం సర్పంచి అడ బాల రవిశంకర్ మండల పరిషత్ అధ్యక్షులు దండు వెంకటరామరాజు(అర్దవరంరాము) జడ్పిటిసి దేవవరపు సోమలక్ష్మి ఎంపీడీవో జి జ్యోతిర్మయి సూర్య బలిజ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి తాసిల్దార్ ఎం సన్యాసిరావు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కే హరినాధ్ రాజు పంచాయతి రాజ్ జేఈ శ్రీనివాసు మండల పంచాయతీ సర్పంచుల ఛాంబర్ అధ్యక్షురాలు చనుమూరి లక్ష్మీ భవాని మండలంలో పలు గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వైసిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు










