
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్ : స్థానిక ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ వారు దాతృత్వంతో క్యాన్సర్ వ్యాధిగ్రస్తురాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు. స్థానిక కళాసి కాలనీకి చెందిన మారంపూడి సత్యవతి అనే ఆమె కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఈమె ఎన్నారై వాసవి అసోసియేషన్ ప్రతినిధి వెలగా నారాయణరావును సంప్రదించి వైద్యం కొరకు కొంత ఆర్థిక సహాయం చేసి ఆదుకొండని ప్రాధేయ పడటంతో నారాయణరావు స్పందించి వెంటనే ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ ద్వారా 50వేల రూపాయలను ఆమెకు వైద్య ఖర్చుల నిమిత్తం ఆదివారం అందజేశారు. అలాగే కొన్ని నిత్యవసర సరుకులు అందజేశారు. మరియు స్థానిక వ్యాపారులు సుతపల్లి శ్రీకాంత్ రామకృష్ణ మెడికల్ స్టోర్ కొప్పర్తి కుమార్ ప్రతినెల వైద్య ఖర్చులు నిమిత్తం 3000 రూపాయలు చొప్పున అందజేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా నారాయణరావు మాట్లాడుతూ ఎన్నారై వాసవి అసోసియేషన్ ద్వారా కరోనా విపత్కర సమయంలో స్థానిక ఏరియా ఆసుపత్రి మరియు పోలీస్ స్టేషన్ లు పలు ప్రాంతాల్లోనూ కరోనా చాంబర్లు ఏర్పాటు చేశామన్నారు. స్థానిక అల్లూరి సీతారామరాజు డిగ్రీ కాలేజ్, బాలయోగి గురుకులం వంటి విద్యా సంస్థలలోనూ నాడు ఏ ఎస్ పి మణికంఠ చందోల్ ఆధ్వర్యంలో పలు గ్రామాల్లోనూ ఆర్వో పాంట్లు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.