Oct 19,2020 12:14

తూర్పు గోదావరి : కాకినాడ వరద బాధితులకు ముంపు వీడేంతవరకూ రెండు పూటలా ఆహారాన్ని ప్రభుత్వం అందించాలని కోరుతూ.. సోమవారం నగర పౌర సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కాకినాడలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. కాకినాడ ప్రాంత తుఫాను బాధితులందరికీ ముంపు వీడేంత వరకూ ప్రతీ రోజు ఉదయం, సాయంత్రం ప్రభుత్వ ఆహార ప్యాకెట్లను పంపిణీ చేయాలని, అవినీతికి తావు లేకుండా రోజువారీ బాధితుల ఆహార పంపిణీ నివేదిక ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.