Sep 16,2023 12:46

ప్రజాశక్తి-చల్లపల్లి : ఎవరెన్ని పొత్తులతో వచ్చినా రాబోయే ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపు సుసాధ్యం అని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు అన్నారు. చల్లపల్లి మండలం మంగళాపురంలో శనివారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది.ఎమ్మెల్యే రమేష్ బాబు, ఆయన తనయుడు సింహాద్రి వికాస్ బాబు ఇంటింటికి వెళ్లి సంక్షేమ పథకాలు వివరించారు.పేదలకు సంక్షేమ పథకాలు సమర్థవంతంగా అందిస్తున్న జగన్ పాలన ప్రజలు మరోసారి కోరుకుంటున్నారని తెలిపారు. జగన్ పారదర్శక పాలన అందించడంతో పాటు నిరుపేదల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేనన్ని సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రవేశపెట్టారని చెప్పారు.పథకాల అమల్లో పక్షపాత వైఖరి చూపకుండా అన్ని వర్గాలకు అర్హతే ప్రామాణికంగా అందిస్తున్నారన్నారు. ముఖ్యంగా ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉంటే పాలన ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజల ప్రత్యక్షంగా చూస్తున్నారని చెప్పారు. ఎన్నికలు, ప్రజాసంకల్ప పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి అనతికాలంలోనే మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారని పేర్కొన్నారు. నిరుపేదలకు సంక్షేమ పథకాలు అందించి వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారని చెప్పారు. ప్రజలకు నిరంతరం మంచి చేయాలనే తపనతో పని చేస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి రానున్న ఎన్నికల్లో అండగా నిలిచి పూర్తి మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన రాట్నాలు, తాసిల్దార్ కే గోపాలకృష్ణ, పంచాయతీరాజ్ ఏ ఈ కే శ్రీనివాస్, ఆర్డబ్ల్యు ఎస్ ఏఈ జగత్,  డ్రైనేజీ ఇరిగేషన్ ఏఈ మహేష్, గృహ నిర్మాణ శాఖ ఏఈ మట్టా అరుణకుమారి, సర్పంచ్ డొక్కు నాగేశ్వరరావు పాల్గొన్నారు.