Nov 15,2023 13:00

హైదరాబాద్‌ : ఆంధ్రా జేమ్స్‌బాండ్‌, లెజెండరీ హీరో, సూపర్‌ స్టార్‌ కృష్ణ తొలి వర్ధంతి నేడు. కృష్ణ తొలి వర్ధంతి సందర్భంగా తాజాగా నమ్రత మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేద విద్యార్థులకు చదువు చెప్పేంచేందుకు పూనుకున్నారు. ఇప్పటికే వారి సొంత ఊరు అయిన బుర్రిపాలెంలో సొంతంగా పేదల కోసం ఒక స్కూల్‌ను నిర్మించారు. ఇలా మహేశ్‌ బాబు ఫౌండేషన్‌ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. సుమారు 3 వేలకు పైగా చిన్నారులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు తాజాగా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు పూనుకున్నారు.

krishna


నమ్రత మాట్లాడుతూ ... మామయ్య గారి వర్థంతి సందర్భంగా.. ఆయన పేరు మీద ఒక స్కాలర్‌ షిప్‌ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఇప్పటికే నలుగురు చురుకైన పేద విద్యార్థులను ఎంపిక చేశామన్నారు. ఇక నుంచి వారిని చదివించే బాధ్యతను ఎంబీ ఫౌండేషన్‌ తీసుకుంటుందని... వారు ఎంత వరకు చదువుకున్నా.. అందుకు అయ్యే పూర్తి ఖర్చులు తామే చూసుకుంటామని అన్నారు. ప్రస్తుతం నలుగురు విద్యార్థులను సెలక్ట్‌ చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మామయ్య ఆశీస్సులు తమకు ఉంటాయని ఆశిస్తున్నామన్నారు. నేడు నలుగురు విద్యార్థులు రేపటి రోజు ఎంతమంది అవుతారో చెప్పలేమని నమ్రత తెలిపారు. '' మాకు చేతనైనంత వరకు పేద విద్యార్ధులను చదవించి వారి అందమైన భవిష్యత్‌కు దారి చూపించాలనేది మా లక్ష్యం.' అని నమ్రత తెలిపారు.