Jan 13,2021 08:53

ప్రకాశం (అద్దంకి) : దేశంలోని దాదాపు ఏడు రాష్ట్రాలను బర్డ్‌ఫ్లూ, ఏవియన్‌ ఇన్‌ఫ్లూ యెంజా వణికిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాధులతో వేల సంఖ్యలో పక్షులు మృత్యువాత పడుతున్నాయి. ఎపిలోనూ ఇటీవల కోనసీమ జిల్లాల్లో కోళ్లు వందల సంఖ్యలో వరుసగా మృతి చెందిన ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇతర రాష్ట్రాల్లో బర్డ్‌ఫ్లూ కలకలం రేపడంతో ఎపిలో అధికారులు అప్రమత్తం అయ్యారు. కాగా, ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో నాలుగు రోజుల నుండి పావురాళ్ళు మృతుచెందుతున్నాయి. స్థానిక నాగులపాడు రోడ్డులోని శివసాయి రెసిడెన్సీ వద్ద పావురాళ్ళ మూతిపై బొబ్బర్లు ఏర్పడి వింత వ్యాధితో గుంపులు గుంపులుగా మృత్యువాత పడుతున్నాయి. బుధవారం ఉదయం కూడా మరో నాలుగు పావురాళ్ళు మృతిచెందడంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. పావురాళ్ల మృత్యువాతకు కారణం తెలియక అనేక రకాలుగా చర్చించుకుంటున్నారు.