ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : అద్దంకి మార్టూరు సర్కిల్ పరిధిలో శుక్రవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. బాపట్ల డిఎస్పి టి.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో అద్దంకి మార్టూరు సర్కిల్ పరిధిలో ఆరుగురు ఎస్‌ఐలు, 130 మంది పోలీసులతో అమరావతి స్పిన్నింగ్ మిల్లు సిబ్బంది నివసించే క్వార్టర్స్ లో పోలీసుల తనిఖీలు చేపట్టారు. ఇటీవల అమరావతి స్పిన్నింగ్ మిల్లు ఆవరణలో గంజాయి విక్రయిస్తూ ఒడిశా రాష్ట్రానికి చెందిన మిల్లు కార్మికులు నలుగురు పట్టుబడిన నేపథ్యంలో... పోలీసులు ఈ కార్డన్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల మోహరింపు. తనిఖీలతో అమరావతి స్పిన్నింగ్ మిల్లు సిబ్బంది కార్మికులు భయభ్రాంతులకు గురయ్యారు.