ప్రజాశక్తి-అద్దంకి (బాపట్ల) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హౌదా, విభజన హామీల సాధనకై యువజన విద్యార్థి సంఘాల సమర యాత్ర శనివారం పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా చలసాని శ్రీనివాసరావు, బాపట్ల సిపిఎం జిల్లా కార్యదర్శి, ఇతర నాయకులు, ఎస్‌ఎఫ్‌ఐ యూత్, తదితరులు స్థానిక బంగారులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. స్థానిక విద్యానగర్లోని ఒక కాలేజీలో నిర్వహించిన సభా కార్యక్రమంలో భారీ సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.










