అమరావతి : ఎపిలో దేవాలయాలు, విగ్రహాల ధ్వంసం కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ సిట్‌కు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దేవుళ్ల విగ్రహాల ధ్వంసానికి సంబంధించి ఎపిలో తీవ్ర దుమారం చెలరేగుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం కేసు విచారణను సిఐడికి అప్పగించింది. రాష్ట్రంలో ప్రార్థనా మందిరాలు, దేవాలయాలపై పదేపదే దాడులు ఒక పథకం ప్రకారం జరుగుతున్నాయని, వీటిపై దర్యాప్తునకు సిట్‌ను నియమించి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని వాటిని అణచకపోతే రాష్ట్ర భవిష్యత్‌కు నష్టం వాటిల్లుతుందని వామపక్షాలు పేర్కొన్నాయి. దీంతో కేసును సిఐడి నుంచి సిట్‌కు బదిలీ చేస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.










