Apr 30,2023 20:35

ప్రజాశక్తి-రాజమండ్రి: జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. కాగా, జగజ్జనని చిట్‌ఫండ్‌ మోసాలపై సీఐడీ విచారణ చేపట్టింది. ఈ క్రమంలో జగజ్జనని చిట్‌ఫండ్స్‌ డైరెక్టర్లుగా ఉన్న ఆదిరెడ్డి, వాసులను అధికారులు అరెస్ట్‌ చేశారు. రాజమండ్రిలోని తమ కార్యాలయంలో ఆదిరెడ్డి అప్పారావు, ఆయన తనయుడు వాసులను సీఐడీ అధికారులు విచారిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న టిడిపి శ్రేణులు అధిక సంఖ్యలో సీఐడీ కార్యలయానికి తరలి వస్తున్నారు.