ప్రజాశక్తి-అమరావతి : అమరావతి సమీప గ్రామాల్లో ముందుగానే పేదల నుంచి భూములు కొనుగోలు చేసి రాజధాని కోసం భూ సమీకరణకు ఇచ్చి అందుకు ప్రతిఫలంగా స్థలాలు తీసుకున్నారనే అభియోగాలను కొట్టేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారాయణ దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ ఈ నెల 21కి వాయిదా పడింది. ఈ మేరకు గురువారం జస్టిస్ వక్కలగడ్డ రాధాకృష్ణ కృపాసాగర్ ఆదేశాలు జారీ చేశారు. వీరిద్దరూ ప్రభుత్వం నుంచి ఖరీదైన నివాస, వాణిజ్య ప్లాట్లు కొనుగోలు చేశారని సిఐడి కేసు నమోదు చేసింది. దీనిని కొట్టేయాలని వారి అభ్యర్థించారు.










