అమరావతి : అమరావతి స్కిల్ కేసులో టిడిపి అధినేత చంద్రబాబుకు వచ్చే నెల 24 వరకు మధ్యంతర బెయిల్ మంజూరైంది. అనారోగ్య కారణాలతో నాలుగు వారాలపాటు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేస్తూ రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది. మధ్యంతర బెయిల్ ఇవ్వాలని చంద్రబాబు దాఖలు చేసిన అనుబంధ పిటిషన్లపై సోమవారం ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరగగా, ఈరోజు ఉదయం 4 వారాలపాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది. అయితే ప్రధాన బెయిల్ పిటిషన్ పై వచ్చే నెల 10వ తేదీన విచారణ జరగనుంది. గత 53 రోజులుగా రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబు ఉన్నారు. సెప్టెంబర్ 9న నంద్యాలలో చంద్రబాబు అరెస్టయ్యారు.