Mar 28,2023 20:29

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మార్గదర్శి చిట్‌ ఫండ్‌ కేసులో ఎమ్‌డి చెరుకూరి శైలజకు సిఐడి నోటీసులు జారీ చేసింది. అక్రమాలు, నిధుల మళ్లింపు కేసులో సిఐడి విచారణకు అందుబాటులో ఉండాలని సిఐడి డిఎస్‌పి రవికుమార్‌ నోటీసులు జారీ చేశారు. మార్గదర్శి చిట్‌ ఫండ్స్‌లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై విచారించాలని సిఐడి నోటీసుల్లో పేర్కొంది. ఈ నెల 29, 31 తేదీల్లోగానీ, ఏప్రిల్‌ 3, 6 తేదీల్లో గానీ అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఇంట్లో గానీ, కార్యాలయంలో గానీ విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపింది.