Oct 21,2023 16:48

ప్రజాశక్తి-పెనుకొండ : జిపిఎస్ ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా యుటిఎఫ్ చేపట్టిన దీక్షలను పలు చోట్ల పోలీసులు భగ్నం చేశారు. అనంతపురం, పార్వతీపురం మన్యం జిల్లాలలో దీక్ష చేస్తున్న యుటిఎఫ్ నాయకులను శిబిరం నుండి హాస్పిటల్ కు పోలీసులు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం శాసన సభలో ఆమోదించిన జిపిఎస్ బిల్లును శుక్రవారం గవర్నర్  ఆర్డినేన్స్  (గెజిట్ ) ద్వారా అమలు చేయడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమేనని యుటిఎఫ్ శ్రీసత్య సాయి జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు శెట్టిపి జయ చంద్రా రెడ్డి, ఎం సుధాకర్ ఖండించారు. శనివారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రెండవ రోజు జిపిఎస్ విధానాన్ని రద్దుచేసి ముఖ్యమంత్రి జగన్ ఇచ్చినటువంటి హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ  ఆమరణ నిరాహార దీక్షలను నిర్వహించడం జరిగింది. అయితే పోలీసులు యుటిఎఫ్ నాయకులు చేపట్టిన దీక్షను భగ్నం చేసి బలవంతంగా నాయకులను అరెస్ట్ చేసి జీపులో పోలీస్ స్టేషన్ కు తరలించారు. అంతకు ముందు నాయకులు దీక్ష శిబిరం వద్ద జిపిఎస్  గెజిట్ కాపీలను దగ్ధం  చేశారు.ఈ సందర్బంగా యుటి ఎఫ్ జిల్లా అధ్యక్షులు శెట్టిపి జయచంద్రరెడ్డి మాట్లాడుతూ  ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వారం రోజుల్లో సిపిఎస్ ను రద్దు చేస్తానని చెప్పి నాలుగున్నర సంవత్సరాలు అయినా కూడా సిపిఎస్ రద్దు చేయకపోగా  ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఉపయోగం కాని జిపిఎస్ అనే కొత్త బిల్లును తీసుకువచ్చారన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కాంట్రిబ్యూషన్ తో పాటు ప్రభుత్వం చేస్తున్నటువంటి కాంట్రిబ్యూషన్ కూడా నిలుపుదల చేస్తూ ఇందులో గ్రాటిట్యూడ్ లేకుండా, ఇది మంచి బిల్లును తెచ్చామని ప్రభుత్వం బకాలుడుతోందన్నారు. అందుకే రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు ఓటు ఫర్ ఓపి ఎస్  అనే నినాదాన్ని గట్టిగా ఉద్యోగ ఉపాధ్యాయులలోకి తీసుకువెళతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. యు టి ఎఫ్ నాయకులతో దీక్ష చేస్తున్న నరేష్, ఆది జినేష్, సోమ శేఖర్ లను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

utf-state-wide-protest-for-ops-in-manyam
అనంతపురం జిల్లా, పెనుకొండ

 

utf-state-wide-protest-for-ops-in-manyam
పార్వతీపురం మన్యం జిల్లాలో 

 

utf-state-wide-protest-for-ops-in-manyam
పార్వతీపురం మన్యం జిల్లాలో చికిత్స చేయిస్తూ... 

 

utf-state-wide-protest-for-ops-in-manyam

 

utf-state-wide-protest-for-ops-in-manyam

 

అనంతరం దీక్ష చేసిన నాయకులు నరేష్, సోమ శేఖర్, ఆది జినేష్ లను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స లు చేయించి, వ్యక్తి గత పూచికత్తుతో యుటి ఎఫ్ నాయకులను పోలీసులు విడుదల చేశారు. అయితే ఇదిలావుండగా దీక్షా శిబిరానికి  జెవివి సత్య సాయి జిల్లా  అధ్యక్షులు డాక్టర్ అదిశేషు, సాహితీ స్రవంతి జిల్లా అధ్యక్షులు హరి, ఘనగిరి జన చైతన్య వేదిక అధ్యక్షులు రాజ శేఖర రెడ్డి, ఏపీ ఎన్ జి ఓ నాయకులు, మధు, వైఎస్ ఆర్ టి ఎఫ్ నాయకులు వేణు గోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్  జిల్లా కార్యదర్శి నారాయణ స్వామి జి.రమేష్  మండల నాయకులు టి.రమేష్  రామాంజినేయులు, గంగాధర్, శేషాద్రి, తదితరులు పాల్గొన్నారు.