
ప్రజాశక్తి-విజయవాడ : స్వతంత్ర వార్తా పోర్టల్ 'న్యూస్ క్లిక్'పై ఢిల్లీ పోలీసుల దాడులను ఖండిస్తూ జర్నలిస్టు, వివిధ సంఘాల ఆధ్వర్యంలో విజయవాడలోని లెనిన్ సెంటర్ వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు. పత్రికా స్వేచ్ఛను హరిస్తూ జర్నలిస్టులపైన, రచయితలపైన దాడులకు పాల్పడుతున్నారంటూ ఆందోళన వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యం కోసం పత్రికా స్వేచ్చా పరిరక్షణకు అందరూ కదలాలంటూ పిలుపునిచ్చారు. ఉపా చట్టాలను ఉపయోగించి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. అరెస్టు చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

.
