
విజయవాడ : ఓపిఎస్ ను అమలు చేయాలని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యుటిఎఫ్) ఆధ్వర్యంలో నిరవధిక దీక్షలు విజయవాడలో బుధవారం ప్రారంభం అయ్యాయి. జిపిఎస్ ను రద్దు చేయాలని, 2003 డి.ఎస్.సి ఉపాధ్యాయులకు పాత పెన్షన్ అమలు చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా చౌక్ వద్ద యుటిఎఫ్ చేపట్టింది. ఈ దీక్షలో పాల్గొనే నాయకులకు పూలమాల వేసి దీక్షా శిబిరాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు ప్రారంభించారు. పిడిఎఫ్ ఎమ్మెల్సీలు ఈ దీక్షకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ప్రకటించారు. దీక్ష చేపట్టిన యుటిఎఫ్ రాష్ట్ర నాయకత్వానికి అభినందనలు తెలిపారు. ఈ దీక్షకు అందరూ మద్దతు తెలపాలని కోరారు.