
ప్రజాశక్తి-అద్దంకి(బాపట్ల) : సిపిఎస్ మరియు జిపిఎస్ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ యుటి ఎఫ్ రాష్ట్ర శాఖ ఇచ్చిన కార్యాచరణ మేరకు శుక్రవారం డివిజన్ కేంద్రాలలో నిరసన దీక్షలు ప్రారంభం సందర్భంగా స్థానిక బంగ్లా రోడ్డులోని అంబేద్కర్ విగ్రహం వద్ద పాత పెన్షన్ సాధన కొరకు నిరసన దీక్షలను ప్రారంభించడం జరిగింది. యుటిఎఫ్ సీనియర్ కార్యకర్తలు జయరావు, సోమేపల్లి హనుమంతరావు దీక్షలు ప్రారంభించారు. సిపిఎస్ రద్దు చేస్తాము అని స్పష్టమైన హామీ నిచ్చిన ప్రభుత్వం సిపిఎస్ ని రద్దు చేయకపోగా జిపిఎస్ అనే ఒక కొత్త దుర్మార్గమైన చట్టాన్ని తీసుకురావడానికి ఖండిస్తున్నామని బాపట్ల జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జె బాబురావు అన్నారు. భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని ఒక కొత్త విధానాన్ని ఈ రాష్ట్రంలో తీసుకురావడం, ఆ విధానం ఉద్యోగులకు ఆమోదయోగ్యంగా లేదని తక్షణమే ఆ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానమే అమలు చేయాలని జిల్లా కార్యదర్శి హరిబాబు తెలిపారు. జిపిఎస్ విధానం గురించి జిపిఎస్ చట్టం గురించి ప్రభుత్వం మరోసారి చేసి చట్టాన్ని వెనుక తీసుకునే వరకు తమ నిరసన దీక్షల కొనసాగుతాయని నాయకులు కోరారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఈ రామారావు ప్రధాన కార్యదర్శి బి పూర్ణచంద్రరావు గౌరవాధ్యక్షులు ఎస్ కె మస్తాన్ వలి , బి చంద్రశేఖర్, కె గంగాధర్, ఎస్ కె పీర్ సాహెబ్, కోటేశ్వరరావు, సర్వేశ్వరరావు,పి కృష్ణారావు, దామా నాగేశ్వరరావు, అయితా శ్రీనివాసరావు ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.