ప్రజాశక్తి-మండపేట : సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని రద్దుపరిచి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరుతూ యుటిఎఫ్ ఆధ్వర్యంలో పాత తాలూకా కేంద్రాల వద్ద నిరవధిక నిరాహార దీక్ష శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా జిల్లా సహాధ్యక్షులు సురేంద్ర మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన రాష్ట్ర కేంద్రమైన విజయవాడలోనూ 19వ తేదీన అన్ని జిల్లాల కలెక్టరేట్ కార్యాలయాల వద్ద ప్రారంభించినటువంటి నిరవధిక నిరాహార దీక్షకు మద్దతు తెలుపుతూ శుక్రవారం అన్ని పాత తాలూకా కేంద్రాల వద్ద వారికి మద్దతుగా నిరవధిక నిరాహార దీక్షను చేపట్టడం జరిగిందన్నారు. పాత పెన్షన్ పునరుద్ధరణ మాత్రమే తమకు ప్రత్యామ్నాయమని ఇతర ఏ రకమైనటువంటి పెన్షన్ విధానాన్ని ఆమోదింలేమన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ఎవరైతే హామీ ఇస్తారో వారికి మాత్రమే మేము ఓటు చేయవలసినదిగా కూడా తీర్మానించడం జరిగిందని రాష్ట్ర అధ్యక్షులు ఎన్. వెంకటేశ్వర్లు మాటను ఉదాహరించారు. జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు కే. గోపాలకృష్ణారెడ్డి అధ్యక్షులు వహించిన కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి జి రాజు, మండపేట, మండల పట్టణ, కపిలేశ్వరపురం నాయకులు ఎం.త్రినాథ్, బి రామచంద్రరెడ్డి, కే సత్తిబాబు,శ్రీనివాస్, రిటైర్డ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు గంటి వీర్రాజు, సిహెచ్ శ్రీహరిరావు, వి దొరకయ్య తదితర ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










