Oct 01,2023 11:24

ప్రజాశక్తి-అద్దంకి : విజయవాడలో  జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 50 వసంతాలు సభకు అద్దంకి నుండి భారీ సంఖ్యలో ఉపాధ్యాయులు స్థానిక బంగ్లా రోడ్డులోని  అంబేద్కర్ విగ్రహం వద్ద నుండి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా  ఉపాధ్యాయులు. యుటిఎఫ్ సంఘ సిల్వర్ జూబ్లీ వేడుక జరుపుకోవడం, దీనికి కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరు కావడం చాలా సంతోషం అని జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జె బాబురావు అన్నారు. ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం లో యు టి ఎఫ్  ఎప్పుడు ముందంజలో ఉంటుందని జిల్లా కార్యదర్శి పి  హరిబాబు తెలిపారు. యు టి ఎఫ్  అద్దంకి మండల అధ్యక్షులు రామారావు, కార్యదర్శి పూర్ణచంద్ర రావు, ట్రెజరర్ దామ రామాంజనేయులు, సీనియర్ నాయకులు సోమేపల్లి హనుమంతరావు, మస్తాన్ వలి, కె గంగాధర్, బి.వి రత్నం, బ్రాహ్మజీ, శ్రీను, సాంబశివరావు, కోటేశ్వరరావు, రాజశేఖర్, శ్రీనివాసరావు మరియు 45 మంది ఉపాధ్యాయులు విజయవాడకు తరలి  వెళ్ళారు.