Sep 27,2023 13:17

ప్రజాశక్తి-అద్దంకి : ఆంధ్ర ప్రదేశ్  ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రాంతీయ కార్యాలయంలో యుటిఎఫ్ 50 సంవత్సరాల జాతాలో  భాగంగా బుధవారం యు టి ఎఫ్ జెండాను సీనియర్ నాయకులు గోరంట్ల లక్ష్మీనారాయణ ఎగురవేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నక్క వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘ నందు గతంలో ఎంతోమంది నాయకులు త్యాగాల ఫలితమే నేడు అనేక సౌకర్యాలు పొందుతున్నామన్నారు ఈ సందర్భంగా ఉపాధ్యాయ సంఘాల ద్వారా చెన్నుపాటి లక్ష్మయ్య, వెంకటస్వామి, వెంకటరత్నం దాచూరు రామిరెడ్డి చేసిన సేవలను వారు చేసిన త్యాగాలను కొనియాడారు. యు టి ఎఫ్ సంఘమనేది ఉద్యమ ఓటమి యుటిఎఫ్ నినాదం విద్య వికాసం ఉపాధ్యాయ సంక్షేమం అనే తెలిపారు. ఉపాధ్యాయ సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతుందన్నారు. క్రమశిక్షణ గల నాయకుల సంరక్షణలో 50 సంవత్సరాలు యుటిఎఫ్ జెండా రెపరెపలాడింది అన్నారు. భవిష్యత్తులో కూడా ఈ జెండా ఇదేవిధంగా ఉద్యమ స్ఫూర్తితో ముందుకు తీసుకొని వెళ్లాలని కోరారు. సిపిఎస్ ను రాష్ట్ర ప్రభుత్వమిచ్చిన హామీ మేరకు రద్దు చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ ను అమలు చేయాలని కోరారు. రాష్ట్ర గౌరవ అధ్యక్షులు కొమ్ముజి శ్రీనివాసరావు మాట్లాడుతూ యుటిఎఫ్ సంఘం 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో రాష్ట్రంలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాలు సంబరాలు జరుపుకోవాలని అభినందనీయమన్నారు ఈ సందర్భంగా మండల కేంద్రాల్లో బైక్ ర్యాలీ కార్యక్రమాలు నిర్వహించడం మంచి పరిణామం, అక్టోబర్ ఒకటవ తేదీన విజయవాడ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజీలో 15వేల మంది ఉపాధ్యాయులతో పెద్ద బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ సభకు యుటిఎఫ్ సభ్యులు రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాపట్ల జిల్లా ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పూ నాటి హరిబాబు, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ జగన్నాథం బాబురావు, అద్దంకి మండల నాయకులు ఎస్.కె మస్తాన్ వలి, ఇట్టా రామారావు, బి పూర్ణచంద్రరావు, పంగులూరు మండల నాయకులు టీవీ నరసింహారావు, ఎస్వీ దుర్గాప్రసాద్, ఆర్ శ్రీనివాసరావు, బి రవిచంద్ర,  కొరిశపాడు  మండల నాయకులు  నాయకులు బొనిగల శ్రీనివాసరావు, దామ రామాంజనేయులు, సోమేపల్లి హనుమంతరావు ఎం సర్వేశ్వరరావు, గంగాధర్, పి బ్రహ్మం, ముండ్లమూరు మండల నాయకులు ధారా శ్రీనివాసరావు, గోగుల కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.