
- యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు
- మార్టురుకి చేరిన స్వర్ణోత్సవ సంబరాల జాతా
ప్రజాశక్తి - మార్టూరు రూరల్ : రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై యూటీఎఫ్ నిరంతర పోరాటం చేస్తుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు అన్నారు. ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) స్వర్ణోత్సవ సంబరాలు అక్టోబర్ 1న విజయవాడలో జరగనున్న నేపథ్యంలో స్వర్ణోత్సవ సంబరాల జాతా ప్రకాశం జిల్లా ఒంగోలు నుండి బాపట్ల జిల్లా అద్దంకి మీదుగా బుధవారం మార్టురుకి చేరుకుంది. స్వర్ణోత్సవ సంబరాల జాతా కు యూటీఎఫ్ బాపట్ల జిల్లా అధ్యక్షులు జాదా వినయ్ కుమార్,ప్రధాన కార్యదర్శి అడుగుల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు ఘన స్వగతం పలికారు. స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయం నుండి జడ్పీ హై స్కూల్ వరకు బైక్ లతో ఉపాధ్యాయులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం హై స్కూల్ సమీపంలో యూటీఎఫ్ పతాకాన్ని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలు,విద్యారంగ అభివృద్ధికి యూటీఎఫ్ చేస్తున్న కృషిని వివరించారు, గౌరవ అధ్యక్షులు కొమ్మోజు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉపాధ్యాయులపై ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానాలపట్ల పోరాటాలను మరింత ఉదృతం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్సులు కందిమళ్ల రవిబాబు, పాలపర్తి రామాంజనేయులు, సంతమాగులూరు, బల్లికురవ, యద్దనపూడి, మార్టూరు మండలాల నుండి నుండి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.