రిచ్‌మండ్ (అమెరికా) : చివరి విడత రసాయన ఆయుధాలను అమెరికా ధ్వంసం చేస్తోంది. ఇందుకోసం రోబోలను ఉపయోగిస్తోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసేనాటికి పేరుకుపోయిన 30లక్షల టన్నులకుపైగా రసాయన ఆయుధాలను సమూలంగా నిర్మూలించాలని దశాబ్దాల తరబడి సాగుతును ప్రచారం దీంతో పూర్తి కానుంది. రిచ్‌మండ్, కెంటకీ, ప్యుబ్లో, కొలరాడోల్లో గల ఆయుధ డిపోల్లో ఈ ఆయుధాల ధ్వంసం సాగుతోంది. కొలరాడోలో గత నెల్లోనే పూర్తయింది. 1997లో అమల్లోకి వచ్చిన అంతర్జాతీయ రసాయన ఆయుధాల ఒప్పందం కింద అమెరికా తన వద్ద మిగిలి వును రసాయన ఆయుధాలను నిర్మూలించడానికి సెప్టెంబరు 30 తుది గడువు. ఆలోగా వీటినిపూర్తిగా నిర్మూలించే ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ ఒప్పందంపై 193 దేశాలు సంతకాలు చేశాయి. 1940ల నుండి ఆయుధ డిపోల్లో దాచుతూ వచ్చిన ప్రాణాంతకమైన విష పదార్ధం జిబి నెర్వ్ ఏజెంట్‌ను నింపిన ఎం55 రాకెట్‌లు 51వేలను కెంటకీలో ఇప్పటికే ధ్వంసం చేశారు. దక్షిణ కొలరాడలో ఆయుధ డిపోలో ఆయుధాల విధ్వంసానిు 2016లో ప్రారంభించగా జూన్ 22తో పూర్తయింది. మొత్తంగా 2600టనుుల మస్టర్డ్ ఏజెంట్‌ను వారు ధ్వంసం చేశారు. మస్టర్డ్ ఏజెంట్‌ను నింపిన శతఘిు తూటాలను రోబోల సాయంతో నిర్వీర్యం చేసి, వెయ్యి డిగ్రీల అధిక ఉష్ణోగ్రత వద్ద మండించారు. దాంతో ఇవి కేవలం తుక్కులా మారాయని అధికారులు తెలిపారు. ఈ తరహా ఆయుధాలు కదనరంగాల్లో ఎంత మాత్రమూ ఆమోదయోగ్యం కాదని అమెరికా అధికారికంగా ప్రకటించినట్లైందని సైనిక నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధంలో మొదటిసారిగా వీటిని ఉపయోగించారు. వీటి వాడకంతో లక్ష మంది మరణించారని భావిస్తున్నారు. ఆ తర్వాత జెనీవా ఒప్పందం కుదుర్చుకుని వీటిని నిషేధించినా దేశాలు వీటిని నిల్వ చేసుకోవడం కొనసాగించాయి.










