న్యూయార్క్ : సిక్కు వ్యక్తి కారును ఢకొీట్టి.. ఆపై తనపై దాడికి పాల్పడ్డాడు ఓ వ్యక్తి. ఈ దాడిలో 66 ఏళ్ల సిక్కు వ్యక్తి తీవ్ర గాయాలు పాలై.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. గత గురువారం జస్మర్ సింగ్ (66), గిల్బర్ట్ అగస్టిన్‌ల ఇద్దరి కార్లు ఢకొీన్నాయి. దీంతో ఇద్దరి కార్లకు గీతలు పడ్డాయి. దీంతో గిల్బర్ట్‌పై 911కి ఫోన్‌చేసి పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సింగ్ ప్రయత్నించాడు. అయితే గిల్బర్ట్ పోలీసులకు చెప్పొద్దని సింగ్‌తో వాదించాడు. అతని దగ్గర ఉన్న ఫోన్‌ని లాక్కున్నాడు. కొద్దిసేపు ఇద్దరు వాదించుకున్న తర్వాత అగస్టిన్ వద్ద ఉన్న తన ఫోన్‌ని తీసుకుని సింగ్ తన కారు వద్దకు వెళ్లాడు. మళ్లీ వెంటనే అగస్టిన్ సింగ్ వద్దకు వచ్చి తన మొహం మీద తలమీద బలంగా కొట్టాడు. దీంతో జస్మిర్ సింగ్ తలకు బలమైన గాయం కావడంతో స్పృహతప్పి పడిపోయాడు. వెంటనే అతన్ని చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించి జస్మర్‌సింగ్ మృతి చెందారు. అయితే మెదడుకు తగిలిన గాయం కారణంగానే జస్మిన్ సింగ్ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, జస్మిర్ సింగ్‌పై జరిగిన దాడిని న్యూయార్క్ మేయర్ ఎరిక్ ఆడమ్స్ తీవ్రంగా ఖండించారు. సింగ్ మృతికి ఎరిక్ సంతాపం తెలిపారు.