
ప్రజాశక్తి - కశింకోట : మండలంలోని త్యేగాడ సచివాలయం ముందు ఉపాధి హామీ పథకం కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని సచివాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన తెలియజేసి సమస్యల పరిష్కారం కోసం సచివాలయం సిబ్బంది కి వినతి పత్రం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా ఉపాధి కూలీలు మాట్లాడుతూ తమకు 200 రోజులు పని దినాలు కల్పించాలని ,రోజుకు 600 రూపాయలు వేతనం ఇవ్వాలని, పనికి సరిపడా గుణపం ,పార, గంపలు, తదితర పనిముట్లు ఇవ్వాలని, డిమాండ్ చేశారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రం ప్రభుత్వం బడ్జెట్లో నిధులు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చే విధంగా ఉపాధి హామీ కూలీలకు వేసవి అలవెన్స్ డబ్బులు ఇవ్వాలని కోరారు. వేసవి కావడం వలన వడ గాల్పులకు తట్టుకోలేకపోతున్నామని పని ప్రదేశంలో టెంట్లు వేయాలని అన్నారు. ప్రభుత్వం వారు గతంలో ఇచ్చే విధంగా పని ప్రదేశంలో కూలీలకు మజ్జిగ, మంచినీరు, సరఫరా చేయాలని అన్నారు .పని ప్రదేశంలో కార్మికుల(కూలీల) ఆరోగ్యం పరిస్థితిల దృశ్య వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. కొంతమంది కూలీలకు 2 వారాల కూలీ డబ్బులు ఇవ్వలేదని ఈ పరిస్థితిని తెలపడానికి ఉపాధి హామీ కూలీలు మండల కేంద్రానికి అధికారుల దృష్టికి తీసుకువెళ్లడానికి వెళ్లారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు దాకారపు శ్రీనివాసరావు, హైమావతి, కె.వెంకటలక్ష్మి, వై. అప్పలనరస, కె.బుచ్చమ్మ ,ఎం.నాగమణి, వి.సాంబ, వి.అప్పలనరస, ఎన్.దుర్గ, పి.చిన్నమ్మలు, కే. సన్యాసమ్మ, ఎం.ఈశ్వరమ్మ, ఎం.పైడిరత్నం, సి.హెచ్.చిన్న తల్లి, సి.హెచ్.లోవతల్లి, కుకల చినలక్ష్మి ,కుకల పెద్దలక్ష్మి తదితర ఉపాధి కూలీలు పాల్గొన్నారు.