Jun 05,2023 15:44

ప్రజాశక్తి-బాపట్ల : ఉపాధి హామీ పరిరక్షణ కోసం, ఉపాధి కూలీలను ప్రతిరోజు తీసే ఫోటోను ఎత్తివేయాలని, మేట్లు వ్యవస్థను కొనసాగించాలని, ఉపాధి కూలీలకు 200 రోజులు తగ్గకుండా పని కల్పించాలని కోరుతూ సోమవారం జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బాపట్ల కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం జరిగింది. అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని  జాయింట్ కలెక్టర్ కు ఇవ్వడం జరిగింది. ఈ ధర్నాకు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు అధ్యక్షత వహించారు. ఈ ధర్నా ఉద్దేశించి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష ,కార్యదర్శులు మెండ్రు ఆంజనేయులు, టి కృష్ణమోహన్ మాట్లాడుతూ ఇంత వేసవిలో కూడా కూలీలు ఉదయం 6 గంటలకు వెళ్లి 11 గంటల వరకు పని ప్రదేశాల్లో కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన ఫోటో వల్ల ఉండవలసి ఉంటుంది, అని కావున వెంటనే ఫోటో తీసే విధానాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయంలో వచ్చిన యంత్రాల వల్ల  కూలీలకు పని దినాలు బాగా తగ్గిపోయినాయి. చట్టంలో 100 రోజులు పని కనిపించాలి అని ఉన్న ఆచరణలో ఎక్కడా కూడా 50 రోజులకు మించి పని చూపించంటం లేదు, కావున రెండు వందల రోజులు పని కల్పించాలని కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. వామపక్షాల పోరాట ఫలితంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులోకి వచ్చింది అన్నారు. ఆ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తుందన్నారు. అందులో భాగంగా మేట్ల  వ్యవస్థను రద్దు చేయడం. సమ్మర్ అలవెన్స్ తీసివేయటం. ఇతర అలవెన్స్ తొలగించడం. బయోమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేయడం. పని వేళల్లో మార్పు. బడ్జెట్లో కోత తదితర అంశాలు ఉన్నాయన్నారు. నేషనల్ మొబైల్ మానిటరింగ్ అప్లికేషన్ వచ్చిన తర్వాత అర్హులైన వందలాది మంది జాబ్ కార్డులు రద్దు చేయబడ్డాయని వాటిని పునరుద్ధరించాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. ఉపాధి హామీ చట్టాన్ని పరీక్షించుకోవడానికి, గతంలో మాదిరిగా పనిముట్లు ఇవ్వాలని, చేసిన పని వివరాలు తెలిపే స్లిప్పులు ఇవ్వాలని, ఎవరు చేసిన పనికి వారికి కొలత తీసి విడివిడిగా కూలి నిర్ధారించి చెల్లించాలని కోరారు. గతంలో పనిచేసిన పనులకు మొక్కలు నాటిన పనులకు పెండింగ్లో ఉన్న బిల్లులు విడుదల తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు తంగిరాల వెంకటేశ్వర్లు, బొనిగల సుబ్బారావు, మురుగుడు సత్యనారాయణ, శ్రీనివాసరావు, సుబ్బరాజు, సుబ్బారావు, వీరయ్య, కెవిపిఎస్ జిల్లా నాయకులు కే శరత్, సిఐటియు టౌన్ కార్యదర్శి జంగం శామ్యూల్ మరియు అనేకమంది ఉపాధి కూలీలు పాల్గొన్నారు.