Jan 20,2021 22:24

కూలీలతో మాట్లాడుతున్న వెంకటలక్ష్మి

ప్రజాశక్తి - ఏలేశ్వరం 'ప్రత్తిపాడు మండలం ఏలూరు గ్రామ పంచాయతీ పరిధిలోని పి జగన్నాధపురంలో జరుగుతున్న ఉపాధి హామీ చట్టం ద్వారా జరుగుతున్న పుంత రోడ్డు పనులను డ్వామా పీడీ అడపా వెంకటలక్ష్మి మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.' ఉపాధి హామీ పథకం కింద రూ.4.50 లక్షల వ్యయం కాగల పుంత రోడ్డు పనులు రెండు రోజులుగా జరుగుతున్నాయి. ఈ పనికి 41 మంది వేతనదారులు హాజరయ్యారు. కూలీల హాజరు, మస్తర్లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉపాధి పనులు పారదర్శకంగా చేపట్టాలన్నారు. ఎటువంటి అవకతవకలు జరిగినా సహించేదిలేదని హెచ్చరించారు. ఈకార్యక్రమంలోఎపిఒ ఎబివి.నాయుడు, టెక్నికల్‌ అసిస్టెంట్లు కొండారావు, శ్రీను, ఫీల్డు అసిస్టెంట్‌ మల్లిబాబు పాల్గొన్నారు.