Mar 26,2023 10:30

కొల్‌కతా : మహత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ చట్టం (ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ) కేటాయింపుల నిలుపుదలకు వ్యతిరేకంగా పశ్చిమబెంగాల్‌ రాష్ట్రవ్యాప్తంగా లెఫ్ట్‌ఫ్రంట్‌ నిరసనలకు పిలుపునిచ్చింది. కోల్‌కతాలోని ముజఫర్‌ అహ్మద్‌ భవన్‌లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో లెఫ్ట్‌ ఫ్రంట్‌ ఛైర్మన్‌ బిమన్‌బసు మాట్లాడుతూ... 'పశ్చిమబెంగాల్‌ రాష్ట్రంలో ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ప్రాజెక్టును ఉద్దేశపూర్వంగా మోడీ ప్రభుత్వం నిలిప ివేస్తోంది. కేంద్ర ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా మార్చి 28,29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చాం. ఈ మూడు తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరగనున్నాయి' అని ఆయన అన్నారు. అలాగే కేంద్ర బడ్జెట్‌లో పశ్చిమబెంగాల్‌కు కేటాయింపులు చేయలేదేని మోడీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. ఎంజిఎన్‌ఆర్‌ఇఎ పథకం కింద పని పొందుతున్న పేద ప్రజలకు పని లేకుండా చేయడానికి, వారిని ఈ పథకానికి దూరం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బసు విమర్శిం చారు. ఎంజిఎన్‌ఆర్‌ఇజిఎ ఎకౌంట్స్‌లో ఏవైనా అవకతవకలుంటే దోషులను తప్పకుండా శిక్షించాలని ఆయన అన్నారు.