Nov 04,2023 14:15

లక్నో :   బనారస్‌ హిందూ యూనివర్శిటీ (బిహెచ్‌యు)లో శతృత్వాన్ని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఉత్తరప్రదేశ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్ రాయ్ పై కేసు నమోదైంది. అఖిల భారతీయ హిందూ యూనివర్శిటీ (ఎబివిపి ) ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు శనివారం పోలీసు అధికారులు తెలిపారు. బిహెచ్‌యు క్యాంపస్‌లో గురువారం జరిగిన లైంగిక వేధింపుల ఘటనలో తమ ఎబివిపి సభ్యుల ప్రమేయం ఉందని అజయ్ రాయ్  వ్యాఖ్యానించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. దీంతో అజయ్ రాయ్ పై ఐపిసి 505(2) (శతృత్వాన్ని రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం, విద్వేషాన్ని పెంచడం ) శుక్రవారం రాత్రి లంకపోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఇన్‌స్పెక్టర్‌ (క్రైమ్‌) షాజానంద్‌ శ్రీవాస్తవ తెలిపారు.
ఈ కేసుపై రాయ్ తీవ్రంగా స్పందించారు. ఎబివిపి భయానికి చిహ్నమే ఈ కేసు అని అన్నారు. దీంతో ఈ వేధింపులకు ఎవరు పాల్పడ్డారనే అంశం వెల్లడైందని, బిహెచ్‌యు ఎబివిపి డెన్‌లాగా మారిందని, బయటి వ్యక్తులను కూడా క్యాంపస్‌లోకి అనుమతిస్తున్నారని మండిపడ్డారు.