లక్నో: భారీ వర్షాలతో ఉత్తరప్రదేశ్‌లో 19 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్టేట్ రిలీఫ్ కమిషనర్ కార్యాలయం సోమవారం సాయం త్రం తెలిపింది. వీరిలో నలుగురు పిడుగుపాటు వల్ల మరణించారని, మరో ఇద్దరు నీటమునిగి మరణించారని పేర్కొంది. హార్దోరులో నలుగురు, బారాబంకిలో ముగ్గురు, ప్రతాప్‌గఢ్, కన్నౌజ్‌లో ఇద్దరు చొప్పున, అమేథి, డియోరియో, జలౌన్, కాన్పూర్, ఉన్నావ్, సంభాల్, రాంపూర్, ముజఫర్‌నగర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారని తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని మధ్యప్రాంతంలో ఆదివారం నుంచి ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తున్నాయి. 22 జిల్లాలో గత 24 గంటల్లో 40 మిలీ ్లమీటర్లకుపైగా వర్షపాతం నమోదైంది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో అనేక ప్రదేశాలు నీట మునిగాయి. రోడ్లు జలమయమయ్యాయి. పట్టాలపైకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ నెల 17 వరకూ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.