Nov 15,2023 16:02

మాలే :   మాల్దీవుల అధ్యక్షుడిగా మొహ్మద్‌ మయిజ్జు ప్రమాణ స్వీకారోత్సవానికి భారత ప్రభుత్వం తరపున కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు హాజరుకానున్నారు. మయిజ్జు ప్రమాణస్వీకారానికి ప్రధాని మోడీకి ఆహ్వానం అందిందని విదేశాంగ శాఖ బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తారని వెల్లడించింది. మయిజ్జు ఆహ్వానం మేరకు కిరణ్‌ రిజిజు రెండు రోజుల పాటు ఆదేశంలో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. మాల్దీవులతో తమ బంధం కొనసాగుతుందని, ఆ దేశానికి సహకారం అందించేందుకు భారత్‌ కట్టుబడి ఉందని తెలిపింది. గత నెలలో జరిగిన మాల్దీవుల అధ్యక్ష ఎన్నికల్లో ప్రొగ్రెసివ్‌ పార్టీ ఆఫ్‌ మాల్దీవ్స్‌ (పిపిఎం) అభ్యర్థి మయిజ్జు విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ నెల 17న మయిజ్జు మాల్దీవుల కొత్త అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.